పుంగనూరు పట్టణంలోని బెస్త వీధిలో గల శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో ఆషాఢ మాస శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం రాహుకాల సమయంలో అమ్మవారికి దీపాలను నివేదించి, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.