వైసీపీ నాయకులు మరోసారి ప్రజలను మోసం చేయలేరని తెలుగుదేశం పార్టీ నాయకులు మధుసూదన్ రాయల్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం పుంగనూరులో ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరిగిందో అందరికీ తెలుసన్నారు. నాయకులు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలని ఆయన హితవు పలికారు. అనంతరం కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిని వివరించారు.