పుంగనూరు మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారి ఆంజనేయస్వామి గుడి వద్ద గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.