పుంగనూరులో వేడుకగా శ్రీవారి కళ్యాణం

పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, సోమవారం శ్రీవారి కళ్యాణోత్సవం వేద పండితులచే ఆగమాన శాస్త్రం ప్రకారం వైభవంగా నిర్వహించబడింది. శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి కళ్యాణ మండపం వద్దకు తీసుకువచ్చి, కన్నుల పండుగగా కళ్యాణోత్సవం జరిపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్