పుంగనూరులో విద్యార్థులను పరామర్శించిన తహసిల్దార్

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని నగిరి వీధి ప్రాథమిక పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం భోజనంలో బల్లి పడటంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను తల్లిదండ్రులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న తాసిల్దార్ రాము, ఎంఈఓ నటరాజ రెడ్డి, విద్యాశాఖ అధికారులు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించి, వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

సంబంధిత పోస్ట్