అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో బుధవారం పర్యటించిన మాజీ ఎంపీ ఎన్. రెడ్డప్ప, చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కుప్పంలో బినామీలను పెట్టుకుని పుంగనూరులో 50వేలకు పైగా ఓట్లు తొలగించాలని చూశారని ఆయన అన్నారు. వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బిఎల్వోలు ఐక్యంగా పనిచేసి, తొలగించాలనుకున్న ఓటర్లను తిరిగి చేర్పించి, రాబోయే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు.