తిరుపతి, సత్యవేడు పరిధిలోని పాలమంగళం దక్షిణ గ్రామ పంచాయతీలో రూ.5 నాణెం లేదా క్యూ.ఆర్ కోడ్ ద్వారా 20 లీటర్ల శుద్ధి చేసిన తాగునీటిని అందించే ఆర్.ఓ. ప్లాంట్ ను ప్రజల వినియోగం కోసం అందుబాటులోకి తెచ్చారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన నీటిని అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సదుపాయంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ వి. ప్రేమలత రాజారెడ్డి, కార్యదర్శి కె. ఆనంద్ ఆచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్లాంట్ ఏప్రిల్ 1, 2026 నుండి అందుబాటులోకి వచ్చింది.