నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారికి వేద మంత్రోచ్చారణల నడుమ వైభవంగా తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలతో పూజలు జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.