వరదయ్యపాలెం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 'బడి పిలుస్తోంది' కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని, జిల్లా విద్యాశాఖ అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తారు. పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకానున్నారు.