నారాయణవరం మండలం పాలమంగళం ఉత్తరపు కండ్రిక గ్రామానికి చెందిన ముని బాబు కాపు సంఘం ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కాపు సోదరులు ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. ముని బాబు మాట్లాడుతూ, కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల అభివృద్ధికి రాజకీయంగా తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. సత్యవేడు నియోజకవర్గం నారాయణవరం మండలం పాలమంగళం గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డి కన్నివేలు, రాయల్ త్యాగరాజు, రాయల్ బాలాజీ, రాయల్ చిరంజీవి పాల్గొన్నారు.