ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మండలి (యుపిఎస్ఐడిఏ)కి చెందిన తొమ్మిది మంది సభ్యుల ప్రతినిధి బృందం, కేపిఎంజి ప్రతినిధులతో కలసి శనివారం శ్రీసిటీని సందర్శించింది. యూపీలో ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి కొరకు శ్రీసిటీ నమూనాను అధ్యయనం చేయడం వీరి పర్యటన ముఖ్య ఉద్దేశ్యం. ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ రాజీవ్ త్యాగి నేతృత్వంలో వచ్చిన బృందానికి శ్రీసిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) ఆర్. శివశంకర్ స్వాగతం పలికారు.