సత్యవేడు: కస్తూర్బ స్కూలుకు సీసీ కెమెరాలు, కంప్యూటర్లు విరాళం

సత్యవేడు నియోజకవర్గం కెవిబిపురం కస్తూర్బ మోడల్ స్కూల్ వసతి గృహానికి టిడిపి ప్రోగ్రాం కోఆర్డినేటర్ కురపాటి శంకర్ రెడ్డి సీసీ కెమెరాలు, కంప్యూటర్ పరికరాలు వితరణ చేశారు. జూలై 10న జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో ప్రిన్సిపాల్ అభ్యర్థనకు స్పందించిన ఆయన, సొంత ఖర్చుతో వీటిని అందించారు. శనివారం నుంచి కెమెరాల బిగింపు ప్రారంభమైంది. ఈ దాతత్వానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్