నాగలాపురం మండలం కొట్టకాడు గ్రామం దళిత వాడలో ఆదివారం సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంచారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో జరుగుతుందన్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.