సత్యవేడు: కన్నుల పండుగగా రాజగోపుర కుంభాభిషేక వేడుకలు

సత్యవేడు పట్టణంలోని శ్రీకళ్యాణ వీరభద్రస్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన రాజగోపరానికి మహా కుంభాభిషేక వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా రెండో రోజు గురువారం ఆలయంలో ప్రధాన అర్చకులు, ఆలయ ధర్మకర్త ఇందూరు రవికుమార్ ఆధ్వర్యంలో అర్చకులు మల్లికార్జున, సుబ్రహ్మణ్యం, యోగేశ్వరయ్య, బాలాజీ బృందం శాస్రోత్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ క్రమంలో గోపుర కలశ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది.

సంబంధిత పోస్ట్