పెద్దపెద్ద భవంతుల్లో నివాసముంటున్న వారు ఇంటి పన్నులు తక్కువ చెల్లిస్తున్నట్టు ఆరోపణ ఉన్న నేపథ్యంలో మరోసారి ఇండ్ల విస్తీర్ణంపై రీసర్వే చేపట్టి కొలతలు తీయాలని తిరుపతి జిల్లా పంచాయతీ అధికారి సుశీలదేవి ఆదేశించారు. శుక్రవారం సత్యవేడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో త్రివిక్రమరావు అధ్యక్షతన స్వర్ణ పంచాయతీ, పారిశుధ్యంపై ఆమె పంచాయతీ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.