సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామ్ సమన్వయకర్త శంకర్ రెడ్డిని స్థానిక ఎంపీడీవో త్రివిక్రమరావు ఘనంగా సన్మానించారు. టిడిపి ప్రోగ్రాం సమన్వయకర్తగా కూరపాటి శంకర్ రెడ్డి ఇటీవల నియమితులైన నేపథ్యంలో సత్యవేడు ఎంపీడీవో త్రివిక్రమరావు శనివారం తిరుపతిలో శంకర్ రెడ్డిని కలిసి ఘనంగా సన్మానించారు. ఎంపీడీవో త్రివిక్రమరావు కూరపాటి శంకర్ రెడ్డికి సాలువ కప్పి పుష్పగుచ్చం అందించి సత్కరించారు.