సత్యవేడు: టిడిపి నేత రాజమాణిక్యంకు ఎమ్మెల్యే ఆదిమూలం పరామర్శ

నాగలాపురం మండలం తెలుగుదేశం పార్టీ నేత రాజమాణిక్యం అనారోగ్యంతో చికిత్స పొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆదివారం నాగలాపురంలోని టిడిపి నేత ఇంటికి చేరుకొని రాజమాణిక్యం ను పరామర్శించారు. తాజా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాజ మాణిక్యం సంపూర్ణంగా కోలుకొని మళ్ళీ ప్రజా జీవితంలోకి రావాలని ఎమ్మెల్యే ఆదిమూలం ఆకాక్షించారు.

సంబంధిత పోస్ట్