నాగలాపురం మండలం టి. పి. కోటకు చెందిన వైసీపీ యూత్ ప్రెసిడెంట్ షబీర్ అహ్మద్, తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాజీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జగన్తో కలిసి ఫోటో దిగారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోరిక నెరవేరిందని షబీర్ అహ్మద్ ఆనందం వ్యక్తం చేశారు. జగన్ను ప్రత్యక్షంగా కలవడం తన జీవితంలో మరపురాని అనుభూతిగా నిలిచిపోతుందని తెలిపారు.