ప్రజా సమస్యలపై గళమెత్తండి: కిలివేటి

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ, జూన్ 1న నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించాలని వైసీపీ పిలుపునిచ్చింది. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఈ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ నిరసనలో ప్రజా సమస్యలపై గళమెత్తనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్