సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేరి, ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని విద్యాపరంగా ఎదగాలని సూచించారు. పిచ్చాటూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన 'బడి పిలుస్తోంది' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మండల స్థాయిలో 10 పరీక్షల్లో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులను సన్మానించి, నగదు పురస్కారాలు అందించారు.