సత్యవేడు నారాయణవనం మండలం కసింమిట్ట గ్రామంలో జూన్ 1న జరగనున్న శ్రీ ఎల్లమ్మ తిరునాళ్ల ఏర్పాట్లపై గ్రామ యువతతో చిత్తూరు ఉమ్మడి జిల్లాల జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యుడు కోనేటి సుమన్ కుమార్ చర్చించారు. సుమారు 40 సంవత్సరాల తర్వాత ఎల్లమ్మ అమ్మవారిని గ్రామ వీధుల్లో ఊరేగించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.