విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన భక్తులు శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి విశేష విరాళం అందించారు. సోమవారం వారు 3. 18కిలోల బరువున్న వెండి నాగపడగలను దేవస్థానానికి అందజేశారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి వారికి స్వీకరించి, దాతలను జ్ఞానప్రసన్న సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనానికి అనుమతించారు. అనంతరం వారికి తీర్థప్రసాదాలు, దేవాలయ ఆశీర్వాదాలను అందజేశారు.