ఘనంగా గోపూజ మహోత్సవం

శ్రీకాళహస్తి మండలంలోని ఓబులపల్లి గ్రామంలో పౌర్ణమి సందర్భంగా పాండురంగ స్వామి అగ్నిగుండం మహోత్సవంలో భాగంగా గోపూజ కార్యక్రమం హిందూ ధర్మ ప్రచార మండలి సభ్యులు పోతుల రాజుకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. అవధూత ఎడిటర్ అక్కూర్తి ఆనందరెడ్డి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వక్తలు గోపూజ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం రాజుకుమార్, ఆనందరెడ్డి పంచముఖ రుద్రాక్షలను భక్తులకు పంపిణీ చేశారు. భజన కార్యక్రమాలు, తీర్థ ప్రసాదాల అనంతరం కార్యక్రమం ముగిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్