శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మృత్యుంజయ స్వామికి సోమవారం నాడు విశేష అభిషేకం వైభవంగా జరిగింది. స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం, స్వామి వారిని పూలమాలలతో అలంకరించి, అర్చకులు పుష్పాలతో అర్చన చేసి, హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.