దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామికి ఘనంగా అభిషేక కార్యక్రమం జరిగింది. ముందుగా గణపతి పూజ, కలశ స్థాపన, పుణ్యావచనం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం శనీశ్వర స్వామికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.