ముక్కంటి సన్నిధిలో ఆదోని ఎమ్మెల్యే

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయ దర్శనానికి విచ్చేసిన ఆదోని ఎమ్మెల్యే శ్రీ పార్థసారథికి బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. బిజెపి అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్, ఇతర నాయకులతో కలిసి వచ్చిన ఎమ్మెల్యేకు శ్రీకాళహస్తి బిజెపి నాయకులు జి వి అమర్ నాథ్, మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు ప్రజ్ఞశ్రీ, ఆలయ పిఆర్ ఓ రవి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ, శ్రీకాళహస్తితో తనకు చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్