శ్రీకాళహస్తిలోని స్టెప్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ ప్రమీలమ్మ మాట్లాడుతూ, ఎయిడ్స్ వ్యాధిని అవగాహనతోనే అరికట్టవచ్చని, హెచ్‌ఐవి సోకిన గర్భిణుల నుంచి బిడ్డకు వ్యాధి రాకుండా మందులతో రక్షించవచ్చని తెలిపారు. ఆర్ట్ మందుల వాడకం గురించి వివరించారు. అనంతరం 30 మంది వ్యాధిగ్రస్తులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలకు న్యూట్రిషన్ పౌడర్, విటమిన్, మినరల్స్ ఫుడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ భాస్కర్, కౌన్సిలర్లు ఉష, రాధిక, స్టెప్స్ సిబ్బంది పాల్గొన్నారు.