శ్రీకాళహస్తిలోని వైసీపీ కార్యాలయంలో బుధవారం, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి 'వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో పోస్టర్, బుక్లెట్ను ఆవిష్కరించారు. ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమై ప్రజలను నిరాశపరిచిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతామని తెలిపారు.