శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ నుండి 'అమరావతి విజయోత్సవ' భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించబడింది. కూటమి నాయకులు, వేలాది మంది కార్యకర్తలు, అమరావతి పరిరక్షణ సమితి అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వందలాది బైకులు, వేలాది మంది ప్రజలు తరలివచ్చిన ఈ ర్యాలీ ఏపీ సీడ్స్ నుండి ప్రారంభమై శ్రీకాళహస్తిలోని నాలుగు మాడ వీధుల గుండా ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జనసేన నేత కొట్టేసాయి ప్రసాద్, పట్టణ అధ్యక్షులు విజయకుమార్, కాసారం రమేష్, కంట రమేష్, అమర్నాథ్, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. అమరావతి కోసం నిలబడిన ప్రతి ఒక్కరి గొంతుక ఈ ర్యాలీలో ప్రతిధ్వనించింది.