దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో పెద్ద కొట్టాయ ఉత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ఆవరణంలోని కోట మండపం వద్ద స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి, వేద పండితులు వేద పారాయణం నిర్వహించి, స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.