పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో సోమవారం పెద్ద కోటాయి ఉత్సవం వైభవంగా జరిగింది. ఆలయ అలంకార మండపం వద్ద సోమ స్కంద మూర్తి, జ్ఞాన ప్రసూనాంబ ఉత్సవమూర్తులను గజమాల, ఆభరణాలతో అలంకరించి, ఆలయం నుంచి కోట మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ మూడుసార్లు ప్రదక్షిణ చేసి, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.