బొక్కసంపాళెంకు కేంద్ర ‘ఉమెన్ ఫ్రెండ్లీ' అవార్డు

శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాళెం గ్రామపంచాయతీ కేంద్రం ప్రతిష్ఠాత్మక 'ఉమెన్ ఫ్రెండ్లీ' అవార్డును అందుకుంది. పంచాయతీరాజ్ శాఖ దీనదయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో దేశవ్యాప్తంగా ప్రథమ స్థానంలో నిలిచి ఈ గౌరవాన్ని దక్కించుకుంది. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా జిల్లా పంచాయతీ అధికారిణి సుశీలదేవి అవార్డును స్వీకరించారు. ఈ అవార్డుతో పాటు రూ. కోటి ప్రోత్సాహక నిధిని పంచాయతీ అభివృద్ధికి వాడనున్నారు.

సంబంధిత పోస్ట్