బీఎన్ కండ్రిగ మండలం పిల్లేటివారికండ్రిగ ఎస్టీ కాలనీలో మంగళవారం గణేష్, వినీషా దంపతుల నాలుగేళ్ల కుమారుడు జ్ఞానేశ్వర్ సాగునీటి కాలువలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. తండ్రి బహిర్భూమికని వెళ్తుండగా అతని వెనుక వచ్చిన బాలుడిని గమనించలేదు. ఆతర్వాత బాలుడు మార్గం తప్పి కాలువలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు గాలించగా, కాలువలో విగతజీవిగా కనిపించిన బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఇటీవల ఆ దంపతుల కూతురు కూడా మరణించడంతో ఏడాదిలోపు ఇద్దరు పిల్లలను కోల్పోయి దంపతులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.