అమరావతి మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన

శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తన స్వగృహం ఉరందూరులో కార్యకర్తలతో కలిసి అమరావతికి మద్దతుగా కొవ్వొత్తులను వెలిగించారు. రైతులు, మహిళల త్యాగాల వల్ల అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయని, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆమోదం లభించడం శుభపరిణామమని ఆయన తెలిపారు. భవిష్యత్తులో అమరావతి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయకుమార్, కాసారం రమేష్, దుర్గాప్రసాద్, వినయ్, కన్నలి ప్రభాకర్, ఆర్ముగం, మహిళా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్