శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తన స్వగృహం ఉరందూరులో కార్యకర్తలతో కలిసి అమరావతికి మద్దతుగా కొవ్వొత్తులను వెలిగించి నిరసన తెలిపారు. రైతులు, మహిళల త్యాగాల ఫలితంగా అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంటు ఆమోదం పొంది, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆమోదం లభించడం శుభపరిణామమని, భవిష్యత్తులో అమరావతి ప్రపంచ పటంలో మంచి గుర్తింపు పొందుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయకుమార్, కాసారం రమేష్, దుర్గాప్రసాద్, వినయ్, కన్నలి ప్రభాకర్, ఆర్ముగం, మహిళా నాయకులు పాల్గొన్నారు.