చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తల్లి కీ. శే పులివర్తి లక్ష్మీ భారతి కర్మక్రియలు ముగిసిన అనంతరం గురువారం పులివర్తి నాని శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ మండపంలో శాలువాతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.