శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన శ్రీదేవి భూదేవి చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పారు వేట అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అడుగడుగునా కొబ్బరికాయలు కొట్టి, హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.