శ్రీకాళహస్తి పట్టణంలో కొత్తపేట సీతాలమ్మ భక్త బృందం ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించి, ప్రజలకు పుచ్చకాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ తిమ్మయ్య మాట్లాడుతూ, అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, పట్టణంలో మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం అధ్యక్షుడు పాలమంగళం రవి, ఆర్గనైజర్ అత్తించేరే నాదముని, అశోక్, ప్రకాష్, కత్తి రవి, పోలీస్ హేమంత్, సాయన్న, చంద్రారెడ్డి, హరి, వెంకటసుబ్బయ్య, మహేష్ పాల్గొన్నారు.