శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు దేవస్థాన ఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యోగాపై అవగాహన పెంపొందించడం, శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, భారతీయ సనాతన యోగా సంప్రదాయాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యాలు. ఆలయ అధికారులు యోగాలో పాల్గొని, ఈవో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు.