ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో ఈ నెల 10వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్ ఆహ్వానించారు. బుధవారం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రికతో పాటు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్‌కు వేదాశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు పగడాల మురళీతో పాటు దేవస్థాన అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్