శ్రీకాళహస్తిలోని సీఎస్సీ అకాడమీలో కంప్యూటర్ పరిజ్ఞానంపై కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకులు హరి యాదవ్, సీనియర్ న్యాయవాది గుమ్మల్ల రాజేశ్వరరావు చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా హరి యాదవ్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ కంప్యూటర్ పరిజ్ఞానం అత్యవసరమని తెలిపారు. విద్యార్థులు కోర్సును విజయవంతంగా పూర్తి చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు.