ఏర్పేడు మండలంలోని అంజిమేడులో ఉన్న శ్రీ ఈశ్వర్ రెడ్డి లా కళాశాలలో సోమవారం మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నిత్యాదేవి ఆధ్వర్యంలో "మాదకద్రవ్యాలు మరియు గంజాయి ముప్పు" అనే అంశంపై జరిగిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, యువతపై వాటి ప్రభావం, సమాజం నుంచి ఈ ముప్పును నిర్మూలించేందుకు అవసరమైన చట్టపరమైన, సామాజిక చర్యల గురించి విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.