తప్పుడు ప్రచారం.. మహిళపై ఫిర్యాదు

శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా ప్రవర్తిస్తున్నారని ఆలయ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక గుర్తు తెలియని మహిళ దేవస్థానం గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నట్లు గుర్తించి, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని వారు కోరారు.

సంబంధిత పోస్ట్