తొట్టంబేడు మండలం, చిలకవారికండ్రిగ గ్రామంలో భూ అమృత్ కేంద్రం వద్ద మండల రైతులతో తిరుపతి పార్లమెంట్ రైతు ఉపాధ్యక్షుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, మే 1వ తేదీన దుర్గాప్రసాద్ గ్రామ బజార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా రైతులకు చేసిన విజ్ఞప్తిని ఖండించారు. గతంలో కారాకొల్లు గ్రామానికి చెందిన గల్లా చంద్రశేఖర్ అనే శాస్త్రవేత్త ద్వారా రైతులకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేయించి, అందించినట్లు తెలిపారు. దుర్గాప్రసాద్ మాయ మాటలకు రైతులు మోసపోవద్దని హెచ్చరించారు. భూ అమృత్ కు దుర్గాప్రసాద్ కి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.