శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయాన్ని సందర్శించారు. ఆయనకు స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్వాగతం పలికి, ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం, మృత్యుంజయ స్వామి వద్ద మాజీ ముఖ్యమంత్రికి స్వామి అమ్మవారి చిత్రపటాన్ని ఈవో, ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దుర్గాప్రసాద్, వినయ్ ఆర్ముగం, ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఆలయ బోర్డ్ మెంబర్ గోపీనాథ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్