శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కొడాలి నాని సోమవారం సందర్శించారు. ఆయనకు మాజీ బోర్డు సభ్యులు బుల్లెట్ జైశాం, మున్న స్వాగతం పలికి, ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం, మాజీ మంత్రికి ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల ప్రసాదాలను అందజేశారు.