శ్రీకాళహస్తి సన్నిధిలోమిషన్ హెల్ది భారత్ వ్యవస్థాపకురాలు

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని పుణ్యక్షేత్రానికి విచ్చేసిన మిషన్ హెల్ది భారత్ వ్యవస్థాపకురాలు తాప్సి ఉపాధ్యాయని, ఆలయ అతిథి గృహం వద్ద మాజీ ఆలయ ధర్మకర్త మండలి కోలా ఆనంద్ కుమార్ చేత ఆత్మీయ స్వాగతం అందుకున్నారు. ఆలయంలో వారు రాహు కేతు ప్రత్యేక పూజలో పాల్గొని, శ్రీకాళహస్తీశ్వర స్వామి-అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. వేద ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామి-అమ్మవార్ల చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ బోర్డ్ మెంబర్ పగడాల మురళి చందు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్