ఉచితంగా టైలర్ శిక్షణ తరగతులు

రాష్ట్రీయ సేవా సమితి (రాస్) వ్యవస్థాప కార్యదర్శి పద్మశ్రీ డాక్టర్ గుత్తా మునిరత్నం 5వ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని రాస్ కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. రాస్ అధ్యక్షులు డా. వెంకటరత్నం, డైరెక్టర్ నాగరాజుల ఆదేశాల మేరకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. జన్ శిక్షన్ సంస్థాన్ ఆధ్వర్యంలో మూడు నెలల ఉచిత టైలరింగ్ కోర్సు పూర్తి చేసిన 60 మంది మహిళలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, కంటా రమేష్, చెంచయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్