శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలం కల్లుపూడి గ్రామంలో జరిగిన గంగమ్మ జాతర సందర్భంగా, అమ్మవారిని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు దర్శించుకున్నారు. కల్లుప్పుడి గ్రామ ప్రజలు, పెరుమాళ్ రెడ్డి స్వాగతం పలికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నం వసుదేవ నాయుడు, నిర్మలమ్మ, కొగిల సుబ్రహ్మణ్యం, శ్రీవారి సురేష్, మొగరాల గణేష్, సుధీర్, సాయి, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.