ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని పరశురామేశ్వర స్వామి దేవస్థానంలో 45 రోజుల హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో సాధారణ హుండీల ద్వారా రూ. 3,94,964, అన్నదాన హుండీ ద్వారా రూ. 20,019 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఛైర్మన్ బత్తల గిరినాయుడు, కార్యనిర్వాహణాధికారి మునిశేఖర్ తెలిపారు. మొత్తం ఆదాయం రూ. 4,14,983గా నమోదైంది.